శనివారం 30 మే 2020
Telangana - May 05, 2020 , 08:21:38

కవితక్కకు థాంక్స్‌.. నిజామాబాద్‌ చేరిన విద్యార్థులు

కవితక్కకు థాంక్స్‌.. నిజామాబాద్‌ చేరిన విద్యార్థులు

నిజామాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరువతో సొంత ఊర్లకు చేరుకున్నారు. వివిధ పోటీ పరీక్షల కోచింగ్‌ కోసం నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌కు చెందిన విద్యార్థులు నంద్యాల పట్టణానికి వెళ్లారు. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయం తన దృష్టికి రావడతో స్పందించిన మాజీ ఎంపీ కవిత నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవికిశోర్‌ రెడ్డితో మాట్లాడారు. తన సొంత ఖర్చులతో భోజన వసతితోపాటు, రెండు బస్సులను ఏర్పాటు చేసి వారిని నిజామాబాద్‌కు తరలించారు.

ఈ రోజు ఉదయం నిజామాబాద్‌ చేరుకున్న విద్యార్థులను జడీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్‌ నీతూ కిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమను సొంతూళ్లకు చేర్చినందుకు కల్వకుంట్ల కవితకు విద్యార్థులు ధన్యావాదాలు తెలిపారు.


logo