మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 15:01:46

‘ఉన్నత స్థానానికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి’

‘ఉన్నత స్థానానికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి’

హైదరాబాద్‌ : ఉన్నత స్థానానికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత కష్టపడి చదవాలని బాలికలకు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచించారు. శనివారం జాతీయ బాలల దినోత్సవాన్ని సందర్భంగా హైదరాబాద్‌ నింబోలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల హోమ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా ఘనంగా జరుపుకోవాల్సిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని అన్నారు.

తాను చదువుకునే రోజుల్లో సరైన వసతులు లేవని.. ఇప్పుడున్న వారికి ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇక్కడ ఉండి చదువుకుంటున్నామని కుంగిపోవద్దని..కుటుంబ సభ్యులు ఉండి కార్పొరేట్ పాఠశాలల్లో చదివి సాధించలేని మార్కులు వీరు సాధించారని చెప్తుంటే గర్వంగా ఉందని అన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆమె కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కమిషనర్ దివ్య, డైరెక్టర్ శైలజ, సూపరిండెంట్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.