శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 14, 2020 , 02:51:58

కిర్గిజ్‌స్థాన్‌లోని విద్యార్థులను రప్పించాలి

కిర్గిజ్‌స్థాన్‌లోని విద్యార్థులను రప్పించాలి

  • విదేశాంగమంత్రికి ఎంపీ నామా నాగేశ్వర్‌రావు లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్‌కు వెళ్లి కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వరాష్ర్టానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేయాలని విదేశాంగశాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ రాశారు. కొవిడ్‌-19 కారణంగా కిర్గిజ్‌స్థాన్‌లో విద్యాసంస్థలను మూసివేయడంతో తెలంగాణకు చెందిన 170 మంది, ఏపీకి చెందిన 65 మంది అక్కడ చిక్కుకుపోయారని తెలిపారు. స్వదేశం రావడానికి స్థానిక ఏజెంట్‌కు ఒక్కొక్కరు రూ.45 వేల చొప్పున విమానచార్జీలు చెల్లించినా.. ఏవో కుంటిసాకులు చెప్తూ ఏజెంట్‌ తప్పించుకొనిపోయారని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు నామా వివరించారు. రూములు ఖాళీచేసిన విద్యార్థులు ప్రస్తుతం ఉండటానికి వసతి లేక రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. 


logo