Telangana
- Jan 22, 2021 , 08:12:36
కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్‌బాల్ పోటీల కసరత్తు

చుట్టూ పచ్చని పంట పొలాలు. ఆకుపచ్చని కోక కట్టుకున్నట్లు పరవశింపచేస్తున్న ప్రకృతి. ఉడుకు రక్తంతో ఉరకలెత్తుతున్న కుర్రాళ్లు. నారు వేసేందుకు సిద్ధంగా ఉన్న మడి. ఇంకేం ఇదే అదనుగా కుర్రాళ్లు తమ ఫుట్‌బాల్ నైపుణ్యానికి పదునుపెట్టారు. కండ్లు చెదిరే రీతిలో అమాంతం గాల్లోకి లేస్తూ బంతిని కిక్ కొడుతున్న తీరు వారెవ్వా క్యా సీన్ హై అనిపించింది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామ యువకులు కరిగెటలో సరదాగా సాకర్ ఆడుతున్న ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఫుట్‌బాల్ పోటీల కోసం ఇలా కసరత్తులు చేస్తున్నారు.