శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 07:13:39

విద్యార్థులూ....ఒత్తిడి వద్దు

విద్యార్థులూ....ఒత్తిడి వద్దు

హైదరాబాద్ : ఇంటర్‌, పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని రాచకొండ, సైబరాబా ద్‌ పోలీసు కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌ సూచించారు.. పరీక్షలంటూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షలు మీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ఫలితాలను ఊహించుకుని భయాందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. టెన్షన్‌ తీసుకుంటే కష్టపడి చదివిందంతా మర్చిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంచేందుకు పోలీసు బాసులు పలు సూచనలు చేశారు.

- పరీక్షకేంద్రానికి గంటముందు చేరుకోవాలి, సమయపాలన పాటించాలి.

- హాల్‌ టిక్కెట్‌, ఇతర సామగ్రి సరి చూసుకోవాలి. 

- ముందురోజు నిద్ర మాని చదవడం అంతా మంచిదికాదన్నారు.

- మీరు చదివిందంతా అర్థం, గుర్తుండాలంటే తగినంత నిద్ర ఉండాలి.

- కండ్లపై ఒత్తిడి పడకుండా చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలన్నారు.

- జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండి, పోషక ఆహారం తీసుకోవాలన్నారు.

- ఛాయ్‌, కాఫీలకు బదులుగా మంచినీరు అధికంగా తాగాలన్నారు. 

- రాత్రి సమయాల్లో తేలికైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. 

- ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కచ్చితంగా తీసుకోవాలి.  దాంతో మెదడు చురుకుగా పని చేస్తుంది. 

- సెల్‌ఫోన్‌లు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.

- రివిజన్‌ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 

తల్లిదండ్రులకు సూచనలు...

- చదువుతోపాటు వ్యాయాయం, మెడిటేషన్‌ చేసేలా ప్రోత్సహించాలి. 

- ఈ సమయంలో పక్కవారితో మీ పిల్లలను పోల్చవద్దు. 

- పిల్లలు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించాలి.

- పిల్లల ముందు ఈ సమయలో అసలు గొడవ పడొద్దు. 

- పిల్లల దృష్టి మళ్లించే విధంగా టీవీలను పెద్ద సౌండ్‌లో పెట్టొద్దు.

- పిల్లలకు సమయానుసారంగా భోజనం పెట్టాలి, నిద్రపోయేలా చేయాలి. logo