శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 22:54:09

గోదావరిలో మునిగి విద్యార్థి మృతి

గోదావరిలో మునిగి విద్యార్థి మృతి

నవీపేట: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నదిలో సోమవారం విద్యార్థి దస్రీ జగన్‌(15) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నవీపేట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం .. జగన్‌ సోమవారం గ్రామానికి చెందిన తోటి విద్యార్థులతో కలిసి సమీపంలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నదిలో స్నానం చేస్తుండగా నీటి మునిగిపోయాడు. జగన్ మండలంలోని నాగేపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తిచేశాడు. మృతుడి తండ్రి లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిలాకేంద్ర దవాఖానకు తరలించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.logo