సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 21:18:54

చెరువులో మునిగి విద్యార్థి మృతి

చెరువులో మునిగి విద్యార్థి మృతి

చెన్నూర్‌ : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం ఆస్నాద్‌లో ఎడ్ల సాయి(16) అనే విద్యార్థి గురువారం చెరువులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని నడిమివాడకు చెందిన ఎడ్ల రాములు, రమణమ్మల కుమారుడు సాయి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి తునికిపండ్ల కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా దాహం వేయడంతో సమీప ఎర్ర చెరువులో నీళ్లు తాగి స్నానం చేసేందుకు అందులో దిగారు. నీళ్లలోకి దిగిన సాయి బయటికి రాకపోగా గ్రామస్తులు గాలించినా దొరకలేదు. సాయి ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. చెన్నూర్‌ సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


logo