ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 20:36:27

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కొడిమ్యాల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మంకు రఘు ప్రసాద్ (14) స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల వినేందుకు సెల్ ఫోన్  కొనివ్వమని తల్లిదండ్రులను పట్టుబట్టాడు.

వారు కొనివ్వకపోవడంతో రెండురోజులుగా ముస్వభావంగా ఉంటున్నాడు. సోమవారం ఇంట్లో చున్నీతో ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు గుర్తించి దవాఖానకు తరలించేలోగా మృతి చెందాడు. రఘుప్రసాద్‌ మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు, వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.