శనివారం 30 మే 2020
Telangana - Apr 30, 2020 , 18:02:21

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా : కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా : కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా సరిహద్దు  చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా కొనసాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాచలం నుండి దుమ్ముగూడెం  వెళ్లే రహదారిలో భద్రాచలం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ...  వాహనాల నమోదు  రిజిస్టర్ ను పరిశీలించారు. మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చే ప్రజలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ఆందోళన కలిగిస్తోందని, ఈ సమయంలో మన రాష్ట్ర  ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  జిల్లా నుండి వెళుతున్న వలస కూలీల వాహన నంబరు, ఏ రాష్ట్రానికి వారు వెళ్తున్నారు సమగ్ర వివరాలతో పాటు వారిలో  ఒకరి ఫోన్ నెంబరు, ఫోటో తీసుకోవాలని అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.  ఈ తనిఖీలో ఆర్టీవో స్వర్ణలత, డీపీవో ఆశాలత, తాహసిల్దార్ శేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


logo