శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 15, 2020 , 06:07:29

ఆస్తిపన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం ..

ఆస్తిపన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం ..

హైదరాబాద్: ఆస్తిపన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మొపి, పన్ను వసూలు చేస్తున్నామని హయత్‌నగర్‌ ఉపకమిషనర్‌ మారుతీ దివాకర్‌ అన్నారు. శుక్రవారం హయత్‌నగర్‌ సర్కిల్‌లోని నాగోలు డివిజన్‌ రాక్‌టౌన్‌ కాలనీలోని తబలా రెస్టారెంట్‌, రాక్‌ సెరామిక్స్‌ నుంచి రూ.21.45 లక్షల ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉపకమిషనర్‌ మాట్లాడుతూ.. పన్ను బకాయిదారులు, ఎగవేతదారుల జాబితాలను సిద్ధం చేసుకుని ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా వసూలు చేస్తున్నామన్నారు. ఆస్తిపన్నుల బకాయిదారులు సకాలంలో పన్నులను చెల్లించి అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఙప్తి చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఏఎంసీ రాజారావుతోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo