శుక్రవారం 10 జూలై 2020
Telangana - Mar 25, 2020 , 20:15:55

హాస్టల్స్‌, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు : డీజీపీ

హాస్టల్స్‌, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు : డీజీపీ

హైదరాబాద్‌ : ప్రభుత్వ నియమాలు, ఆదేశాలు ఉల్లంఘిస్తే అన్ని హాస్టల్స్‌, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి ఆందోళనతో నగరంలోని పలు ప్రాంతాల్లో హాస్టల్స్‌ నుంచి విద్యార్థులను నిర్వాహకులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో ఎటూపాలుపోని విద్యార్థులు సమీప పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్పందించిన డీజీపీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేస్తే అన్ని వసతిగృహాలు, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వసతి సౌకర్యాన్ని కొనసాగిలించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు, ఏసీపీలు, జోనల్‌ డీసీపీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టల్స్‌ నిర్వాహాకులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ప్రయాణించేందుకు ఎటువంటి అనుమతులు గానీ ఎన్‌వోసీలు గానీ ఇవ్వరన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇవి కొనసాగుతాయని పేర్కొన్నారు. 


logo