గురువారం 09 జూలై 2020
Telangana - Apr 11, 2020 , 16:14:16

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...

నిర్మల్ : ఈరోజు నిర్మల్ పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రధాన కూడలిలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.  స్వీయ నియంత్రణతో కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కారణాలు లేకుండా బయట వాహనాలపై తిరుగుతున్న వారిపై చట్టపరమైన పైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలందరూ స్వీయా నిర్బందంలో ఉంటూ తమవంతు సహకారం అందించాలి.

కరోనా వైరస్ మహమ్మారిని తరమడానికై తిండి తిప్పలు లేకుండా 24 గంటలు పోలీసులు తిరుగుతున్నారు. ప్రజలు అందరు స్వీయా నిర్బందంలో ఉండి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీ ప్రాణలు కాపాడుకోవడం మా బాధ్యత, లాక్ డౌన్ కు జిల్లా ప్రజలు సహకరించాలి, అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


logo