గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 22:04:50

‘విదేశీ పటాకులు విక్రయిస్తే కఠిన చర్యలు’

‘విదేశీ పటాకులు విక్రయిస్తే కఠిన చర్యలు’

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీలో విదేశీ పటాకుల అమ్మకాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. కేంద్రం ఇప్పటికే విదేశీ పటాకులను నిషేధించిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ పటాకులు ఎవరైనా విక్రయిస్తున్నట్లు గుర్తించే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విదేశీ పటాకుల దిగుమతి, అమ్మకాలు, సరఫరా చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇప్పటివరకు విదేశీ పటాకులు నగరానికి దిగుమతి కాలేదని ఆయన వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.