శనివారం 04 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 17:04:08

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ :  రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని కలెక్టరేట్‌లో జిల్లా పోలీస్‌, వ్యవసాయ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఏ దుకాణంలో కానరావొద్దన్నారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేసి స్టాకును పరిశీలించాలన్నారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


logo