మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 21:42:29

ఇంట‌ర్ ఫ‌లితాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉందా? ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి!

ఇంట‌ర్ ఫ‌లితాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉందా? ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి!

తెలంగాణ : ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ఈ రోజు మ‌ధ్యానం మూడు గంట‌ల‌కు రిలీజ్ చేశారు. పాసైన‌వాళ్లు బాగానే ఉంటారు. కొంత‌మందికి మార్కులు త‌క్కువ వ‌చ్చాయ‌నో, ఫెయిల్ అయ్యార‌నో, ఇంట్లో వాళ్లు తిడ‌తారనో ముందుగానే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నారు. కొంత‌మంది అయితే ఫ‌లితాలు రాక‌ముందే భ‌యంతో సూసైడ్ చేసుకుంటున్నారు.  దీనికి కార‌ణం ఒత్తిడి. రిజ‌ల్ట్స్ స‌మ‌యంలో స్టూడెంట్స్ ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో సైక‌లాజిస్టుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏడుగురు సైక‌లాజిస్టుల ఫోన్ నెంబ‌ర్ల‌ను వెల్ల‌డించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు త‌క్కువ వ‌చ్చాయ‌ని ఒత్తిడికి గుర‌య్యే వాళ్లు ఎవ‌రైనా.. 7337225803, 7337225424, 7337225364, 7337225360, 7337005083, 7337225098, 7337225763 ఈ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌మ‌ని సూచించింది. 


logo