మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 13:53:05

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి ఈటల

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి ఈటల

ఖమ్మం :  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం పట్టణంలోని  జడ్పీ హాల్ లో మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. కరోనా వైరస్ పట్ల నిరంతరం అప్రమత్తతో మెలగటంతోనే పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఖమ్మంలో కరోనా టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రభుత్వ సెంటర్ లతో పాటు ఇంటిలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన పెరిగిందన్నారు. దానికనుగుణంగానే తాము మందులు, వైద్యులను అందుబాటులో ఉంచి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నామని మంత్రి ఈటల తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బాలరాజు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, తదితరులు పాల్గొన్నారుlogo