శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 22:04:14

రెండు రోజుల పాటు శాంపిళ్ల సేకరణ నిలిపివేత

రెండు రోజుల పాటు శాంపిళ్ల సేకరణ నిలిపివేత

హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో కరోనా టెస్టులు రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 50వేల కరోనా టెస్టులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు 36వేల శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు.

కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే, హాస్పిటల్స్‌లో కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అలాగే సేకరించిన శాంపిల్స్‌లో ఇంకా 8253 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో శాంపిళ్ల సేకరణ నిలిపివేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తి నుంచి కరోనా శాంపిల్ తీసుకుంటే, దాన్ని 48 గంటల లోపు పరీక్షించాలి. అప్పటి వరకు దాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి శాంపిల్స్ సేకరించడం వల్ల ల్యాబ్స్‌లో పెద్ద ఎత్తున జమ కావడంతో వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రం పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది. కరోనా పరీక్షలు అవసరం ఉన్న వారికి నిరంతరాయంగా పరీక్షలు చేస్తామని వివరించింది.


logo