ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 00:48:22

గోవర్ధనగిరిలో రాకాసి గూళ్లు

గోవర్ధనగిరిలో రాకాసి గూళ్లు

  • జనగామ జిల్లాలో కొత్త రాతియుగం ఆనవాళ్లు
  • పాధిహామీ పథకం    తవ్వకాల్లో బయటకు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఉపాధిహామీ పనుల్లో భాగంగా గ్రామంలోని గోపాలస్వామి గుడి దిగువన ఫాం పాండ్స్‌ను, కందకాలను తవ్వుతుండుగా శిలాయుగపు ఆదిమానవులు ఉపయోగించిన పనిముట్లు, రాకాసి గూళ్లు కనిపించాయి. బంగారు రంగులో మెరిసే చెవిపోగు, చేనేత పరిశ్రమలో ఉపయోగించే రాతి పరికరం, మట్టిబిల్లలు, రాతి గొడ్డళ్లు, ఇతర రాతి పనిముట్లు బయటపడ్డా యి. వాటిని ఔత్సాహిక పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి.. తనమిత్ర బృందం కాంసాని కిశోర్‌రెడ్డి, సంపతి రాజురెడ్డి, కండ్లకోల్ల వెంకటేశ్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆ అవశేషాల ఆధారంగా గ్రామంలో కుమ్మరి, లోహపరిశ్రమ, కొత్త రాతియుగపు రాతి పనిముట్ల, చేనేత పరిశ్రమ వర్ధిల్లినట్టు తెలుస్తున్నదని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. గుట్ట దిగువన చిట్టెం రాళ్ల దిబ్బ, రాతితో కట్టిన దిగుడుబావి, నిలువురాళ్ల సమాధి, అనేక రాకాసి గూళ్లు ఉన్నాయని తెలిపారు. 


logo