శనివారం 30 మే 2020
Telangana - May 03, 2020 , 01:27:31

గల్లీ లాక్‌.. వైరస్‌కు బ్రేక్‌!

గల్లీ లాక్‌.. వైరస్‌కు బ్రేక్‌!

  • కరెన్సీ నోట్లు సహా అన్ని కాంటాక్టులకు కత్తెర 
  • ఇంటింటిలో శానిటైజేషన్‌, పోలీస్‌ పెట్రోలింగ్‌
  • సూర్యాపేటలో కరోనా కట్టడి వ్యూహాలు ఇవే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకరినొకరు కలువకుండా ఉంచి కరోనావ్యాప్తిని నియంత్రించవచ్చనే ప్రా థమిక సూత్రం పక్కాగా అమలుచేసి సూర్యాపేటలో ప్రభుత్వం విజయం సాధించింది. గల్లీలన్నీ లాక్‌చేసి, కరెన్సీనోట్లను సైతం శానిటైజ్‌ చేయడంతో వైరస్‌ కట్టడి సాధ్యమైంది. ఫలితంగా 11 రోజులుగా సూర్యాపేటలో ఒక్కకేసూ నమోదుకాలేదు. కొన్నిరోజుల కిందట సూర్యాపేటలో 83 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ప్రభు త్వం సవాల్‌గా తీసుకున్నది. సూర్యాపేటలో కూరగాయల మార్కెట్‌ ప్రాంతం వైరస్‌వ్యాప్తికి కేంద్రం. ఆ మార్కెట్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చారు. ఆ జోన్‌ గల్లీలను లాక్‌చేశారు. ఎవరూ బయటికి రాకుండా, లోపలికి వెళ్లకుండా కట్టడిచేశారు. ప్రతిఇంట్లోనూ సోడియంహైపోక్లోరైట్‌తో పిచికారి చేయించారు. వీధుల్లో సీసీకెమెరాలు బిగించి ప్ర జల కదలికలపై నిఘా పెట్టారు. డ్రోన్లద్వారా పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వీధుల్లో తిరుగుతూ గస్తీ పెం చారు. ఇలా ప్రతిదశలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయని వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.


logo