కోవిడ్ రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దోచుకుంటున్నారు. రెమ్ డిసెవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్ లో మార్కెట్లో వేలల్లో అమ్ముతున్నారు. మానవత్వం చూపించాల్సి ఇలాంటి సమయంలో పీడించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ నేను మానవత్వం ఉన్న మనిషినంటున్నాడు రాంచీలో ఓ ఆటోడ్రైవర్.
జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషెంట్లకు ఉచిత ప్రయాణం కల్పించాడు. సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ ని పెట్టాడు. అంతేకాదు ఆటోకి కూడా ఫోన్ నెంబర్ తో ఉన్న పోస్టర్ ని అతికించాడు.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే కోవిడ్ రోగులను హాస్పిటల్ కి తీసుకెళ్లాతానని వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయనని చెబుతున్నాడు. ఈనెల 15న కోవిడ్ సోకిన ఓ మహిళను రిమ్స్ హాస్పిటల్లో దింపానని ఆ తర్వాత ఆమెని ఎవరూ తీసుకెళ్లడానికి ముందుకు రాలేదన్నాడు. ఆ ఆలోచననే తానీ పనిచేయడానికి కారణమైందంటున్నాడు ఈ ఆటోడ్రైవర్.
అసలే కర్ఫ్యూ , అది కాకుండా పెరిగిన పెట్రోల్ ధరలతో ఆటో పై వచ్చే సంపాదన ఎంత. కానీ లాభాపేక్ష లేకుండా కేవలం మానవత్వంతో ఈ ఆటోడ్రైవర్ చేస్తోన్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.