గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 13:09:43

నిమ్స్‌లో స్టెమ్ సెల్స్ ల్యాబ్ ప్రారంభం

నిమ్స్‌లో స్టెమ్ సెల్స్ ల్యాబ్ ప్రారంభం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని నిమ్స్‌లో స్టెమ్ సెల్స్ ల్యాబ్‌ను రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. రోజుకు 10 వేల టెస్టులు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ ల్యాబ్ సొంత‌మ‌ని మంత్రి తెలిపారు. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డేవారికి ఈ ల్యాబ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. పేద ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిమ్స్‌ను మ‌రింత అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అన్ని సౌక‌ర్యాల‌తో రూ. 250 కోట్ల‌తో ఓపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని పెంచేలా నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. 

రాష్ర్టంలో 40 ల‌క్ష‌ల మందికి యాంటీబాడీస్ డెవ‌ల‌ప్ అయ్యాయ‌ని ఐసీఎంఆర్ చెప్పిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌ట్ల ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంది. కొద్ది మందిలో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు అగుపిస్తున్నాయి. కొంద‌రిలో అగుపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. టిమ్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో కూడా వైద్యసేవ‌లు అందుతున్నాయి. న‌గ‌రానికి న‌లుమూల‌ల అద్భుత‌మైన వైద్య‌శాల‌లు నిర్మించ‌బోతున్నామ‌ని తెలిపారు. రాష్ర్టంలో వైద్యారోగ్య శాఖ‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. 


logo