శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 14:31:43

ఇంట్లోనా... ఆస్పత్రిలోనా... నిర్ణయం మీదే

ఇంట్లోనా... ఆస్పత్రిలోనా... నిర్ణయం మీదే

సూర్యాపేట : ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేడు హుజూర్‌నగర్‌ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దన్నారు. నిత్యావసర సరుకుల దుకాణాల్లో వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల ముందు నీళ్ల బకెట్‌, సబ్బును ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఎక్కువ పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్‌ ప్రమాదం గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నియమాలు, సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఇంట్లో ఉంటారో... లేదా వాటిని అతిక్రమించి హాస్పిటల్స్‌లో ఉంటారో నిర్ణయం మీదేనని అన్నారు.


logo