శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 02, 2020 , 14:38:44

పరిశుభ్రతతో వ్యాధులు దూరం : మంత్రి అల్లోల

పరిశుభ్రతతో వ్యాధులు దూరం : మంత్రి అల్లోల

నిర్మల్ :  ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంలో పాత ఫొటోలు, సోఫాల పైన ఉన్న దుమ్ము ధూళిని, ఇంటి లోపలి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నివారణ కోసం.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ  కార్యక్రమంలో పాల్గొననున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వర్షం నీటిని నిలువ లేకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి సూచించారు.logo