గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:23

శుభ్రతతో వ్యాధులు దూరం

శుభ్రతతో వ్యాధులు దూరం

  • ఆదివారం పదిగంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కందుకూరు: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపుతో ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాల కార్యక్ర మం జోరుగా సాగుతున్నది. సామాన్యు లు మొదలు మంత్రు ల వరకు ఇందులో భాగస్వాములవుతున్నారు. పరిసరాల పరిశుభ్రతతో సీజనల్‌ వ్యాధులను నివారించవచ్చని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, చామకూర మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తమ నివాస సముదాయాల్లో దోమలు పెరుగడానికి అవకాశమున్న నిల్వ నీటిని తొలిగించారు.

 పూలకుండీలు, వాననీటి నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచారు. వానకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమలను నివారించేందుకు ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనుమడు ఇంద్రారెడ్డితో కలిసి శ్రీనగర్‌లోని తన ఇంటి మిద్దెపై గార్డెన్‌లో పూల మొక్కల కుండీల మధ్య నిల్వ ఉన్న నీటిని తొలిగించారు. పరిసరాలను శుభ్రపరిచి, మందు పిచికారీ చేశారు. 


logo