శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:29

చూడచక్కని రామసముద్రం

చూడచక్కని రామసముద్రం

  • చెరువుకు రాష్ట్రవ్యాప్త  గుర్తింపు 

దుబ్బాక టౌన్‌: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్ర ంలోని రామసముద్రం చెరువుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. దుబ్బాకలో సీఎం కేసీఆర్‌ చదువుకునే రోజుల్లో ఇదే చెరువు కట్టపై కఠినమైన పద్యాలను కంఠస్థం చేస్తూ తెలుగు భాషపై పట్టుసాధించారు. అందుకే కేసీఆర్‌ భాషాపరమైన సందర్భాల్లో ప్రతిసారి దుబ్బాక రామసముద్రం చెరువును ప్రస్తావిస్తుంటారు. తన జీవితాన్ని మ లుపు తిప్పడంలో ఈ చెరువు కట్ట ఎంతగానో దోహదపడిందంటారు. అదే భావనతో రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. ఈ కట్ట  అభివృద్ధి బాధ్యతను 2015లో మంత్రి హరీశ్‌రావు, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అప్పగించారు. మొ దటి విడుతలో సీఎం కేసీఆర్‌ రూ.4.86 కోట్లను మం జూరు చేసి చెరువు కట్టను అభివృద్ధి చేశారు. కనీసం సైకిల్‌ కూడా వెళ్లేందుకు దారి లేని చెరువు కట్టను విస్తరించి, కట్టకు ఇరువైపులా స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి పూల మొక్కలు తెప్పించి నాటించా రు. 

రామలింగారెడ్డి చనిపోవడానికి కొద్దిరోజుల ముందు 200కు పైగా కొబ్బరి మొక్కలను నాటారు. బతుకమ్మ మెట్లతోపాటు బోటింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఓపెన్‌ జి మ్‌, చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను బిగించారు. వేసవిలో చెరువు కట్టపై ఉన్న గడ్డి, మొక్కలు ఎండిపోకుండా స్ప్రింక్లర్ల ద్వారా నీరు చల్లే ఏర్పాటు చేశారు. దీంతో చెరువు కట్ట నిత్యం పచ్చదనంతో కనువిందు చేస్తున్నది. ఇటీవల రూ.10 లక్షలతో నూతనం గా ఏర్పాటు చేసిన ఆధునిక షీటాయిలెట్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ చెరువు అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి, పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంత ంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. ఈ కట్టపై పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు, పాత్‌వే, జ్ఞాన మందిరం, క్యాంటిన్‌ వంటి సదుపాయాలను కల్పించాల్సి ఉన్నది.