మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 13:28:50

మొక్కలు నాటిన స్టేట్ స్ట్రీట్ ఎండి రమేష్ ఖాజా

మొక్కలు నాటిన స్టేట్ స్ట్రీట్ ఎండి రమేష్ ఖాజా

హైద‌రాబాద్ : ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ స్టేట్ స్ట్రీట్ ఎండి రమేష్ ఖాజా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు ఆయ‌న చందానగర్‌లోని తన‌ నివాసంలో మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ ఖాజా స్పందిస్తూ...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి తోడ్ప‌డుతుంద‌న్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మమత మాదిరెడ్డి హెచ్ఎస్‌బీసీ(హెడ్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ ), బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత కుమార్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా పిలుపునిచ్చారు.logo