శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 00:56:30

సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యం

సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యం
  • బడ్జెట్‌పై బిల్డర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీవీఎస్‌రెడ్డి ప్రశంస

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ: రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షే మం, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిచ్చారని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డీవీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమపథకాలతోపాటు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, రోడ్లుభవనాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. అన్నిరంగాలకు ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్‌ను రూపొందించిన  సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  logo