గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 19:41:44

హన్మాజీపేట్‌ పీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం

హన్మాజీపేట్‌ పీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర వైద్య  బృందం

కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర వైద్యశాఖ ప్రతినిధుల బృందం సందర్శించింది. దవాఖానలో కరోనా పరీక్షలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ఇప్పటి వరకు దవాఖానలో నమోదైన కేసుల వివరాలను వైద్యురాలు విజయమహాలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్నవైద్య సేవలను పరిశీలించారు. పీహెచ్ సీని సందర్శించిన రాష్ట్ర బృందంలో వెంకటేశ్‌, అమర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు. 


logo