శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 21:19:46

వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయి అవార్డు

 వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయి అవార్డు

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో రాష్ట్రస్థాయిలో  జిల్లాలోని తుర్కపల్లి మండలం ములకలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు ప్రథమ బహుమతి దక్కింది. రుతుచక్రం సందర్భంగా మార్కెట్లో లభించే పలురకాల ప్యాడ్స్‌ను వాడడం వల్ల మహిళలు అనేక రుగ్మతలకు లోనవుతుండడంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఔషధ మొక్కల నుంచి తీసిన రసాయనాలతో స్త్రీ రక్ష ప్యాడ్స్‌ను పాఠశాల విద్యార్థినులు తయారు చేశారు.  

‘ఆర్గానిక్ జీరో వేస్ట్ స్త్రీ రక్ష ప్యాడ్స్’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020కి ఎంపికై రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. ఈ పోటీల్లో 7,093 ఎగ్జిట్ బిట్లు పాల్గొనగా ములకలపల్లి పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు పి కళ్యాణి ప్రణాళికతో విద్యార్థులు అనిత, స్వాతి శైలజలతో అధునాతన పద్ధతిలో రూపొందించిన ఎగ్జిట్ రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. ప్రశంసా పత్రంతోపాటు 75,000 నగదును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అందుకున్నారు.


ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని చైతన్య జైని పాఠశాల ఉపాధ్యాయురాలు పీ కళ్యాణి తో పాటు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉందని డీఈవో అన్నారు. ప్రాజెక్టు రూపకల్పనకు అడ్డగూడూరు జెడ్పీహెచ్ఎస్ ఎన్ సీఎస్ఈ కో-ఆర్డినేటర్ సీహెచ్ భరణి, సెక్టార్ ఆఫీసర్ అండాలు సహకరించారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి..

తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు : మంత్రి పువ్వాడ

వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు : మంత్రి వేముల

సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ కవిత 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం