మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 15:38:56

రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలి: ఉట్నూర్ ఏఎస్పీ

రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలి: ఉట్నూర్ ఏఎస్పీ

ఆదిలాబాద్: రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ఉట్నూర్ ఏఎస్పి శభరిష్ స్వీకరించి, ఉట్నూర్ పోలిస్ స్టేషన్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఎస్పి డాక్టర్ శభరీష్  మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని పచ్చదనంగా మర్చాలని కంకణం కట్టుకున్నారని, వారి కల త్వరలోనే నెరవేరుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు అధికారులు.. తన భార్య స్నేహలత ఐఏఎస్ ప్రత్యేక అధికారి మంచిర్యాల, తన ఇద్దరు మిత్రులు వినిత్ ఐపీఎస్, గౌషాలం ఐపీఎస్ లను గ్రీన్ చాలెంజ్ కు నామినేట్ చేసి, మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రం పచ్చగా వెల్లివిరియాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని స్వీకరించి మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉట్నూర్ సీఐ నరేష్, ఎస్ఐ సుబ్బారావు, టి ఆర్ ఎస్ వి  జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్,  ఉట్నూర్  కో ఆప్షన్ మెంబర్ సాజిద్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. 


logo