గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 20:46:32

అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం

అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించింది. అంటువ్యాధుల నివారణ చట్టంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై నిబంధనలు రూపొందించింది. ఏడాది పాటు అంటువ్యాధుల నివారణ చట్టం అమలులో ఉంటుంది. కరోనా నివారణ చర్యలు తీసుకునే అధికారం పలు విభాగాల అధికారులకు అప్పగించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు, మున్సిపల్‌ కమిషనర్లకు అధికారాలు అప్పగించారు. స్క్రీనింగ్‌, కరోనా పరీక్షల విధానాలను ప్రభుత్వం ఇందులో పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


logo
>>>>>>