సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 07:48:41

పంచాయతీ ఖాతాల్లోకే నేరుగా నిధులు!

పంచాయతీ ఖాతాల్లోకే నేరుగా నిధులు!

హైదరాబాద్‌ : ప్రతినెలా విడుదలచేస్తున్న నిధులను ఇకపై నేరుగా పంచాయతీల ఖాతాలోనే జమచేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.309 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నప్పటికీ, అవి పంచాయతీలకు ఆలస్యంగా చేరుతున్నాయి. మెదక్‌ జిల్లా డీపీవో ఏప్రిల్‌ నెలలో ఇవ్వాల్సిన నిధులను ఎలాంటి ఇబ్బందులు, కారణాలు లేకుండానే ఆపేసి, ఆగస్టులో విడుదలచేశారు. ఆ అధికారి నిర్లక్ష్యం కారణంగా పంచాయతీలు ఇబ్బందులు పడాల్సిరావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని డీటీవో (జిల్లా ట్రెజరీ అధికారులు), డీపీవో (జిల్లా పంచాయతీ అధికారులు)ల ప్రమేయం లేకుండానే నేరుగా పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేయాలని యోచిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo