బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 21:55:44

సీఎం ప్రతిపాదనను స్వాగతించిన రాష్ట్ర రైతులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

సీఎం ప్రతిపాదనను స్వాగతించిన రాష్ట్ర రైతులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత పంటల సాగు పద్దతిని రాష్ట్రంలోని రైతులందరూ స్వాగతించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల అవసరాలను అంచనా వేసినట్లు చెప్పారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగుపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. వానాకాలంలో మక్కల సాగు లాభదాయకం కాదన్నారు. మక్కలకు బదులు కందులు, పత్తి లాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. అన్ని జిల్లాల రైతుబంధు అధ్యక్షుల నుంచి ఇవాళ అభిప్రాయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.


logo