గురువారం 16 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:20:57

తెలంగాణ థర్మల్‌ ప్రాజెక్టులో స్టార్టప్‌ 400 కేవీ లైన్‌ ప్రారంభం

తెలంగాణ థర్మల్‌ ప్రాజెక్టులో స్టార్టప్‌ 400 కేవీ లైన్‌ ప్రారంభం

జ్యోతినగర్‌: రామగుండం ఎన్టీపీసీలో కొత్త గా నిర్మిస్తున్న 1600 మె గావాట్ల తెలంగాణ సూ పర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ప్రధానమైన స్టార్ట ప్‌ 400 కేవీ లైన్‌ స్విచ్‌యార్డును ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించారు. 400 కేవీ సర్క్యూట్‌ లైన్‌ను తెలంగాణ ప్రాజెక్టు జీఐఎస్‌ స్విచ్‌యార్డుకు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర విద్యుత్‌ మోటర్స్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు రామగుండం నుంచి 400 కేవీ విద్యుత్‌లైన్‌ ద్వారా స్విచ్‌యార్డుకు అమర్చారు. ఈ విద్యుత్‌లైన్‌ ప్రాజెక్టులో చేపట్టిన బాయిలర్‌, టర్బైన్‌ ట్రయల్న్‌ నిర్వహించేందుకు దోహదపడనుంది. ప్రాజెక్ట్‌ సీజీఎం, ఈడీ-పీపీఎం ప్రేమ్‌ప్రకాశ్‌, అధికారులు పాల్గొన్నారు.


logo