మొదలైన దీర్ఘరాత్రులు

- పగలు కంటే రాత్రి సమయం అధికం
- శీతల ఐనము సంభవించడమే కారణం
- ఓయూ ఖగోళశాస్త్ర విభాగాధిపతి శాంతిప్రియ
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దీర్ఘరాత్రులు (లాంగెస్ట్ నైట్స్) మొదలయ్యాయి. డిసెంబర్ 22 నుంచి శీతల ఐనము ప్రవేశించడంతో పగలు కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండనున్నదని ఉస్మానియా యూనివర్సిటీ ఖగోళశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డీ శాంతిప్రియ తెలిపారు. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు క్రమంగా మారుతూ ఉంటాయని.. ఈ మార్పులను రెండు ఐనములుగా విభజిస్తారని పేర్కొన్నారు. డిసెంబర్ 22న వచ్చే ఐనము రెండవదని, శీతల ఐనము అని పేర్కొన్నారు. జూన్ 20 లేదా 21వ తేదీన వేసవి ఐనము ప్రవేశిస్తుందని చెప్పారు. ఆ రోజునుంచి పగటి సమయం రాత్రి సమయంకంటే ఎక్కువగా ఉంటుందని వివరించారు. కాగా, మార్చి 20 లేదా 21న, సెప్టెంబర్ 20 లేదా 21న విషువత్తు సంభవిస్తుందని ఆ రోజున పగలు, రాత్రి సమంగా ఉంటాయని చెప్పారు. ఈసారి సంభవించిన ఐనములో గురుడు, శని గ్రహాలు అతి దగ్గరగా వచ్చి ప్రకాశవంతంగా దర్శనమిచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల్-రంగాపూర్ అబ్జర్వేటరీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఖగోళశాఖ ఆధ్వర్యంలో ఆ మహా సముచ్ఛయాన్ని విద్యార్థులు వీక్షించారని.. టెలిస్కోప్ ద్వారా ఫొటోలు తీసి వారికి వివరించామని చెప్పారు.
తాజావార్తలు
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..