గురువారం 02 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 14:31:33

ప్రభుత్వ దవాఖానలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

ప్రభుత్వ దవాఖానలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

 జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరోనా టెస్టింగ్ ల్యాబ్, హెపటైటస్ బి, చిన్న పిల్లల వార్డులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, జడ్పీ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ శృతి ఓఝాతో కిలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి  మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానలోని కరోనా టెస్టింగ్ ల్యాబ్ లో ప్రతిరోజు టెస్టులు చేస్తారన్నారు. దీంతో జిల్లా ప్రజలకు దూర భారం తప్పుతుందన్నారు.

అలాగే హాస్పిటల్స్ లో అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో మాట్లాడి త్వరలోనే గద్వాల దవాఖానకు సరిపడా డాక్టర్లను నియమిస్తామన్నారు. కరోనా టెస్టింగ్ ల్యాబ్ లో పరికరాలను పరిశీలించారు. గద్వాల ప్రభుత్వ దవాఖానలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

                     


logo