శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 17:46:25

దుబ్బాక‌.. ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు

దుబ్బాక‌.. ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు

సిద్దిపేట : ర్యాండమైజేషన్‌ ద్వారా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళీకేరి తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగారెడ్డి ఏన్ఐసీ నుంచి ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్‌తో కలిసి పోలింగ్‌స్టేషన్‌ వారీగా, ఎన్నికల సిబ్బందిని తుది ర్యాండమైజేషన్‌ కేటాయింపు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 3న దుబ్బాకలో జరిగే ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్‌కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ముగ్గురు ఇతర పోలింగ్‌ అధికారుల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. ఈ ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, ఎన్నికల సహాయక అధికారి అన్వర్, ఈడీఏం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.