సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 22:22:13

దేశంలో ఎక్కడా లేని విధంగా నిధుల కేటాయింపు..

దేశంలో ఎక్కడా లేని విధంగా నిధుల కేటాయింపు..

హైదరాబాద్ : గిరిజనుల జనాభా దామాషా ప్రకారం కేటాయించిన నిధులు ఆయా శాఖల్లో చేస్తున్న ఖర్చు అంశంపై 40 శాఖలతో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. ఈ  సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీస్ సమావేశం నిర్వహించాము. 40 శాఖలు హాజరయ్యాయి. ఎస్టీ నిధులు పూర్తిగా ఖర్చు కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. అవసరమైతే అధికంగా కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎస్టీలకు రూ.7184.87 కోట్లు కేటాయిస్తే..సుమారు 5000 కోట్ల రూపాయలు (70 శాతం) ఖర్చు చేశారు. మిగిలినవి ఈ ఏడాది లోపు ఖర్చు చేయాలని చెప్పామన్నారు. సీఎం కేసీఆర్ 500 కోట్ల రూపాయలతో కొత్తగా గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల కోసం కేటాయించారు.  సుమారు 140 కోట్ల రూపాయలు 3 ఫేస్ కరెంట్ కోసం ఇవ్వాలని చెప్పారు. ఖర్చు కానీ నిధులకు కారణాలు అడిగి, ఖర్చు చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు నిర్దేశించారు. మార్చి 6వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో గిరిజనుల కోసం కేటాయించిన నిధులన్నీ ఖర్చు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పినట్లు వెల్లడించారు.  గిరిజన సమాజం అభివృద్ధి చెందేలా ఖర్చు చేయాలని చెప్పాము.

బడ్జెట్ సమావేశాలకు ముందే ఎస్టీల నిధులు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.  ఎస్టీలకు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేస్తాము.గిరిజన శాఖలో ఎక్కువగా విద్య మీద ఖర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ తెచ్చిన గురుకుల విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం ఇస్తున్నాం. గిరిజనులు ఇతర కంపెనీలలో పని చేసే వారు కాదు...వారే కంపెనీలు పెట్టుకొనే విధముగా సీఎం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద వారిని పారిశ్రామిక వేత్తలు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీ లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. 


logo