గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 22:42:27

స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు వాయిదా!

స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు వాయిదా!

న్యూఢిల్లీ: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్సెస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ (10+2) లెవెల్‌ పరీక్ష (టైర్‌-1), జూనియర్‌ ఇంజినీర్‌ పరీక్ష (పేపర్‌-1) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎస్సెస్సీ తెలిపింది. ఈ నెల 20 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ పరీక్షలకు తాజా షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం నిరంతరం కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. కాగా, ఎస్సెస్సీ గత నాలుగేండ్లలో 2019-20లో అతి తక్కువగా 14 వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గురువారం పార్లమెంట్‌కు తెలిపారు. 2014-15లో గరిష్ఠంగా  2,28,218 మందికి ఎస్సెస్సీ ఉద్యోగాలిచ్చిందన్నారు. logo