శనివారం 11 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:21:32

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

  • కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లో సమావేశాలు

కొవిడ్‌-19 నిబంధనలపై ప్రత్యేక నిఘాహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా పరీక్షల నిర్వహణ కమిటీలతో సమీక్షిస్తున్నారు. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నందున కొవిడ్‌-19 నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. అన్ని పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్‌ అందుబాటులో ఉంచనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులకు రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ, భద్రత కోసం పోలీసుల సాయం కోరారు. పాత హాల్‌ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తున్నారు. ఇప్పటికే టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లు అప్‌లోడ్‌ చేసినట్టు బోర్డు డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.  


logo