ఆదివారం 31 మే 2020
Telangana - May 15, 2020 , 01:28:53

పరీక్ష గదిలో 10 మంది విద్యార్థులే

పరీక్ష గదిలో 10 మంది విద్యార్థులే

  • హైకోర్టులో విద్యాశాఖ అఫిడవిట్‌ దాఖలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరీక్ష గదిలో పది మంది విద్యార్థులే ఉండేలా ఏర్పాట్లు చేశామని, వాయి దా పడిన టెన్త్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని  కోరుతూ విద్యాశాఖ గురువారం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేసింది. భౌతికదూరం, పరిశుభ్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుమతించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అఫిడవిట్‌లో కోరా రు. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 23 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేశామని చెప్పారు. కాగా, ఈ అంశాన్ని విచారణకు స్వీకరించాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం హైకోర్టు ఎదుట ప్రస్తావించనున్నారు. 


logo