మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 04:41:26

నెలరోజుల్లో 2.63 లక్షల మంది శ్రీవారి దర్శనం

నెలరోజుల్లో 2.63 లక్షల మంది శ్రీవారి దర్శనం

  • హుండీ ద్వారా రూ.15.80 కోట్ల ఆదాయం

తిరుమల, నమస్తే తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకొని శనివారం నాటికి నెల రోజులు పూర్తయ్యింది. ఈ సమయంలో 2,63,000 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.15.80 కోట్ల ఆదాయం వచ్చింది. లక్ష మందికిపైగా తలనీలాలు సమర్పించారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 20న భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. జూన్‌ 11వ తేదీ నుంచి తిరిగి దర్శనాలు కల్పిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠ క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిచేశారు. క్యూలైన్లలో పలుప్రాంతాల్లో శానిటైజర్లు, లిక్విడ్‌ ఓజోన్‌ స్ప్రేలను టీటీడీ అధికారులు ఏర్పాటుచేశారు.


logo