మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 17:34:56

శ్రీశైలం ఆనకట్టకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు...

శ్రీశైలం ఆనకట్టకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు...

హైదరాబాద్‌ : శ్రీశైలం ప్రాజెక్టు సెఫ్టీ, ప్యానల్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశమైంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ప్యానల్‌ కమిటీ ఛైర్మన్‌ ఎ.బి పాండ్యా మాట్లాడుతూ... ఆనకట్ట పరిరక్షణకు కీలక సూచనలు చేశాం. కొన్ని అంశాలపై సంబంధిత సంస్థలతో విచారణ జరిపించాలని సూచించాం. ఇప్పటికిప్పుడు శ్రీశైలం ఆనకట్టకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆనకట్ట నిర్వహణ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకోవాలి. ఆనకట్ట నిర్వహణకు డ్రిప్‌, ఇతర నిధులను వాడుకోవాలని సూచించారు. ఆనకట్ట నిర్వహణకు కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీశైలం తెలిపారు. 


logo