బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:02:16

మళ్లీ గేట్లెత్తిన శ్రీశైలం

మళ్లీ గేట్లెత్తిన శ్రీశైలం

  • ఎగువ ప్రాజెక్టుల నుంచి పెరిగిన వరద
  • ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు జలాలు
  • ఆల్మట్టి, నారాయణపురకు ఇన్‌ఫ్లోలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ నెట్‌వర్క్‌: ఎగువన ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తున్న తరుణంలో అధికారులు శ్రీశైలం జలాశయంలో మరోసారి 8 గేట్లను ఎత్తి జలాలను దిగువకు వదిలారు. బుధవారం ఉదయం ఒక్క గేటు ద్వారా నీటి ని విడుదల చేయగా.. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2,19,133 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు సాయంత్రం మరో ఏడు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పెరగడంతో రాత్రి 07:45 గంటలకు నాగార్జునసాగర్‌లోనూ 8 క్రస్టుగేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు గోదావరిలో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్‌కు 4,558 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతేమేర జలాశయం నుంచి కాల్వలకు వదులుతున్నారు. ఎల్లంపల్లికి ఆరు వేల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తున్నది. logo