సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 08:26:06

గరిష్ఠ స్థాయికి శ్రీశైలం.. రెండు గేట్ల ఎత్తివేత

గరిష్ఠ స్థాయికి శ్రీశైలం.. రెండు గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌ : శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి, దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 1,48,385 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 86,485 క్యూసెక్కుల వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో 885 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలకుగాను అదే మొత్తంలో నీరుంది. దీంతో ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు భారీగానే వరద వస్తున్నది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.45లక్షలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, ప్రస్తుతం 1,043 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను 8.770 టీఎంసీల నీరుంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 1,13,886 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo