మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 07:43:02

శ్రీరాంసాగర్‌ @ 88.112 టీఎంసీలు

శ్రీరాంసాగర్‌ @ 88.112 టీఎంసీలు

హైదరాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 31,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 25,055 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం 1090.60 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 90.303 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 88.112 టీఎంసీల మేర నీరుంది. కాగా, ప్రాజెక్టు నుంచి వరద కాలువకు గురువారం అధికారులు నీటిని విడుదల చేశారు. సుమారు ఎనిమిది టీఎంసీల నీటిని తరలించి మధ్యమానేరును నింపనున్నారు. ఎగువ నుంచి 31,245 పదివేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. వాటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo