శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 09:09:29

శ్రీరాంసాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌ : గోదావరికి భారీగా వరద పెరుగుతోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు వరద వస్తుండడంతో శ్రీరాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 75,794 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు 74,794 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగులు కాగా పూరిస్థాయిలో నిండింది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 90.31 టీఎంసీలు ఉంది. జలాశయం గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. అలాగే వరద కాలువ ద్వారా దిగువ మానేరులోకి సైతం నీటిని తరలిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo