ఏప్రిల్ 21న భద్రాద్రి సీతారామ కల్యాణోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం : ఏప్రిల్ 13 నుంచి 27వ తేదీ వరకు భద్రాద్రిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజున ఉదయం వేపపూత ప్రసాద వినియోగం, మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. సవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న మృత్స్యంగ్రహణం, వాసు హోమం, అంకురారోపణంతో ప్రారంభమై 18న గరుఢపట లేఖనం, 19న ధ్వజారోహణం, 20న ఎదుర్కోలు, 21న సీతారామకల్యాణ మహోత్సవం, 22న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. 23న సదస్యం, 24న తెప్పోత్సవం, చోరోత్సవం, 25న ఊంజల్ సేవ, 26న వసంతోత్సవం, 27న చక్రతీర్థ, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షణలు, ధ్వజావరోహణం, ద్వాదశ ఆరాధనలు, శేష వాహన సేవ, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించి వైదిక కమిటీ రూపొందించిన నివేదికను ఈవో శివాజీ.. ఆమోదం కోసం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్కు పంపారు.
తాజావార్తలు
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
- అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?
- బీజేపీని నువ్వు కొన్నవా..?
- రైల్వే ఉద్యోగం పేరుతో మోసం
- పనిమనిషిపై పాశవికం..
- మల్టీలెవల్ పేరిట మోసాలు