బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:50:15

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కూలీకెళ్లాడు

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కూలీకెళ్లాడు

  • కరీంనగర్‌ జిల్లాలో టెన్త్‌ విద్యార్థి కఠోర శ్రమ
  • మూడు నెలల్లో రూ.9 వేలు సంపాదన

గంగాధర: కరోనా కాలంలో ఆన్‌లైన్‌ పా ఠాలు నడుస్తున్నాయి. పేదరికం కారణంగా చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మూడు నెలలు కూలీ పని చేసి కూడబెట్టిన డబ్బులతో ఫోన్‌ కొనుక్కుని ఆత్మవిశ్వాసంతో ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నాడు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సిర్రం శివరాం. శివరాం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. తండ్రి మల్లయ్య కూలీ పనిచేస్తుండగా, తల్లి వెంకవ్వ దివ్యాంగురాలు. పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నా.. ఫోన్‌ లేకపోవడంతో వినలేని పరిస్థితి. దీంతో డబ్బుల కోసం మూడు నెలల పాటు కూలీ పనులకు వెళ్లాడు. పైసాపైసా కూడబెట్టి రూ.9 వేలతో ఇటీవల ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేశాడు. స్వయంకృషితో కొనుకున్న ఫోన్‌లో శనివారం పాఠాలు వింటూ కనిపించాడు. చదువుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన శివరాంను గ్రామస్థులు అభినందిస్తున్నారు. 


logo