శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:52

నేడు నీరాకేఫ్‌కు శంకుస్థాపన

నేడు నీరాకేఫ్‌కు శంకుస్థాపన

  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తొలి నీరాకేఫ్‌కు గురువారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఆరునెలల్లోనే నీరాకేఫ్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేఫ్‌ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పలువురు గౌడకుల సంఘాల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గీతవృత్తిని నిషేధించేందుకు కుట్రలు జరిగితే.. సీఎం కేసీఆర్‌ పాలనలో కులవృత్తులకు పూర్వవైభవం వస్తున్నదని చెప్పారు. నీరా కేఫ్‌కోసం విలువైన స్థలాన్ని కేటాయించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంట ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌, సంఘం నాయకులు బాలరాజుగౌడ్‌, పర్యాటకశాఖ కమిషనర్‌ మనోహర్‌, ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, ఖురేషీ, దత్తరాజ్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo